Tamil Nadu : తమిళనాడులో దారుణం.. బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్

Tamil Nadu : తమిళనాడులో దారుణం.. బాలికపై ఏడుగురు గ్యాంగ్ రేప్
X

తమిళనాడు కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. కునియముత్తూరులో 17 ఏళ్ల బాలికపై ఏడుగురు విద్యార్థులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇంటర్ ఫెయిలై బామ్మ ఇంట్లో ఉంటున్న బాలికకు సోషల్ మీడియాలో ఓ కాలేజీ విద్యార్థితో పరిచయమైంది. ఆమెను నమ్మించి తన గదికి రప్పించుకున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను నగ్నంగా ఫోటోలు తీశాడు. అంతేగాక ఆరుగురు సహచర విద్యార్థులను కూడా తన గదికి రప్పించి, ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు. ఆపై సోమవారం ఉదయం ఆ బాలికను ఆమె ఇంటి వద్ద విడిచిపెట్టి పారిపోయారు. దీంతో ఆ బాలిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురు విద్యార్థులను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

Tags

Next Story