Minor Girl : వరంగల్‌లో దారుణం .. మైనర్ బాలికపై సీఐ అత్యాచారయత్నం!

Minor Girl : వరంగల్‌లో దారుణం .. మైనర్ బాలికపై సీఐ అత్యాచారయత్నం!
X

పోలీస్ కమిషనరేట్‌పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 16ఏళ్ల మైనర్ బాలికపై సీఐ రవికుమార్‌ అత్యాచారయత్నం చేసినట్లు తెలుస్తోంది. హనుమకొండ పీజీఆర్ అపార్ట్మెంట్ లో ఉంటున్న సీఐ..అదే అపార్ట్మెంట్ లో నివాసంలో ఉంటున్న మైనర్ బలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు కాజీపేట్ పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పలుమార్లు లైంగిక దాడికి యత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సీఐ రవికుమార్ పై లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీఐ రవికుమార్ పరారీలో ఉన్నారు. నిందితుడు రవి కుమార్ గతంలో మామునూర్ పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేశాడు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమాజంలో అత్యాచార ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే దారుణాలకు పాల్పడటం ఏంటని స్థానికులు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు.నిందితుడిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. Demand to suspend the registration of CI Ravikumar's POCSO case and punish him severelyచేశారు.

Tags

Next Story