TG : 4ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్టు

TG : 4ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్టు
X

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌరంపేటలో ఈనెల 12న నాలుగేళ్ల చిన్నారిపై యోగి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత కుటుంబం మేడ్చల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని, వైద్య నివేదికలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసుపై దర్యాప్తు జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ డీసీపీ కోటిరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లి తండ్రులు తమ పిల్లల్ని నిత్యం కనిపెట్టుకొని ఉండాలని వారు సూచించారు.

Tags

Next Story