Third Party Apps : లోన్ల కోసం థర్డ్ పార్టీకి డాక్యుమెంట్లు ఇస్తున్నారా.. జాగ్రత్త!

Third Party Apps : లోన్ల కోసం థర్డ్ పార్టీకి డాక్యుమెంట్లు ఇస్తున్నారా.. జాగ్రత్త!
X

బ్యాంక్ రుణాలలో థర్డ్ పార్టీ ఏజెన్సీ సేవల మాటున సైబర్ నేరస్థులు చీటింగ్ కు పాల్పడుతున్నారు. రుణాల కోసం వెళ్లిన ఖాతాదారుల డేటాతో సైబర్ నేరగాళ్ల మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్ ఖాతాదారులను లక్ష్యం చేసుకోవడానికి డేటా నిర్వహణలో బ్యాంకుల డొల్లతనం తేటతెల్లమౌతోంది. ఖాతాదారుల ఆధార్, పాన్, వ్యక్తిగత చిరునామా, ఫోన్ నంబర్లు వంటి డేటా, కాల్ సెంటర్, రుణాల దరఖాస్తు ప్రక్రియ తదితర సాంకేతిక సేవల కోసం బ్యాంకులు థర్డ్ పార్టీ ఏజెన్సీలపై ఆధారపడుతున్నాయి. వెరసి రుణాలు మంజూరు చేయాల్సింది బ్యాంకులే అయినా సాంకేతిక పరిశీలన, దరఖాస్తు ప్రక్రియని థర్డ్ పార్టీ ఏజెన్సీలు పర్యవేక్షిస్తున్నాయి.

ఈ క్రమంలో ఏజెన్సీల్లో పనిచేసే ఉద్యోగులు కీలక డేటాను సైబర్ నేరస్థులకు విక్రయిస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసుల విచారణలో తేలింది. ఇటీవలను బయటివారికి వాటిని అమ్మేస్తున్నారు. ఓ ప్రైవేట్ ఉద్యోగి కొత్త ఇళ్లు కొనుగోలు కోసం ప్రైవేట్ బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాంకు నుంచి ఇంటి కెళ్లే లోపు తాను బ్యాంకు ప్రతినిధినంటూ ఫోన్ రావడంతో పాటు గృహరుణం ఆమోదం పొందాలంటే తాము పంపే లింకు క్లిక్ చేయాలని చెప్పాడు. రెండు రోజుల తర్వాత మరొకరు ఫోన్ చేసి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలను సేకరించే యత్నం చేశాడు. దీంతో సదరు బ్యాంక్ ఖాతా దారుడు సకాలంలో బ్యాంకు అధికారులకు సమాచారమిచ్చి సైబర్ కేటుగాళ్ల నుంచి తప్పించుకున్నాడు. రాష్ట్రంలో బ్యాంక్ రుణాల పేరిట నెలకు పదుల సంఖ్యలో మోసపోయి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారని, ఇటీ వల ఈతరహా ఫిర్యాదులు పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

బ్యాంక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం ఎలా బయటకు వెళుతోందన్న విషయాపై ఆరా తీస్తున్నామన్నారు పోలీసులు. విచారణలో భాగంగా బ్యాంక్లకు, థార్డ్ పార్టీలకు మధ్య ఉన్న సంబంధాలపై విచారణ చేపడుతున్నామని సైబర్ పోలీసులు వివరిస్తున్నారు.

Tags

Next Story