Kuppam : బైకు దొంగలు అరెస్ట్.. 18 వాహనాలు సీజ్

Kuppam : బైకు దొంగలు అరెస్ట్.. 18 వాహనాలు సీజ్
X

ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను కుప్పం పోలీసులు చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుండి 18 వాహనాలను సీజ్ చేసి ఆరు మందిని అరెస్ట్ చేశారు. గుడిపల్లె పోలీస్ స్టేషన్లో కుప్పం డి.ఎస్.పి పార్థసారథి, కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, అర్బన్ సీఐ శంకరయ్య లు మీడియా సమవేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. పిఈఎస్ మెడికల్ కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అరుణ్ కుమార్, హరి, మోహన్, మణిగండన్, ముకేష్, దినేష్ లను పట్టుకుని విచారించామని తెలిపారు. కదిరిగోపనపల్లి వద్ద దాచి ఉంచిన 18 ద్విచక్రవాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండి తమ తమ వాహనాలకు సంబంధించి లాక్ లను సరిచూసుకోవాలని సూచించారు..

Tags

Next Story