Bollywood Actress Sister Arrested : బాలీవుడ్ నటి సోదరి అరెస్టు

బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియా అమె రికాలో అరెస్టయ్యారు. జంట హత్య కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. గత నెల మాజీ బాయ్ ఫ్రెండ్, అతడి స్నేహితురాలి ని అలియా సజీవదహనం చేసినట్లు ఆరోపణ లున్నాయి. న్యూయార్క్ ఉంటున్న అలియా ఫక్రీ కొంతకాలం పాటు ఎడ్వర్డ్ జాకోబ్ అనే యువకుడితో డేటింగ్ ఉంది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాది క్రితం విడిపో యారు. అనంతరం జాకోబు అనాస్టాసియా ఎటినీ అనే యువతితో పరిచయమైంది. వీరిద్ద రూ సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుసుకున్న అలియా పలుమార్లు తన మాజీ బాయ్ఫ్రెం డ్పై బెదిరింపులకు పాల్పడింది. ఈ క్రమంలో నే నవంబరు 2న జాకోబ్, ఆయన స్నేహితురా లు ఉంటున్న భవనం వద్దకు వెళ్లి ఆ ఇంటికి నిప్పంటించింది. దీన్ని గమనించిన స్థానికులు వారిని అప్రమత్తం చేశారు. అయితే అప్పటికే
మంటల్లో చిక్కుకుని వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా అలియా ఫక్రీని అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె దోషిగా తేలితే జీవితఖైదు పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆమెను రిమాండ్కు తరలించారు. తదుపరి విచారణ ను ఈ నెల9కి వాయిదా వేశారు. సోదరి అరె స్టుపై నర్గీస్ ఫక్రీ స్పందించాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com