Bollywood Celebrities : బాలీవుడ్ సెలబ్రిటీలకు పాక్ నుంచి బెదిరింపు మెయిల్స్!

బాలీవుడ్ సెలబ్రిటీలను చంపేస్తామంటూ మెయిల్స్ రావడం కలకలం సృష్టిస్తోంది. కమెడియన్ కపిల్ శర్మ, యాక్టర్ రాజ్‌పాల్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, సింగర్ సుంగధ మిశ్రాకు బుధవారం మెయిల్స్ వచ్చాయి. ‘మిమ్మల్ని గమనిస్తున్నాం. మాది పబ్లిక్ స్టంట్ కాదు. మీరు స్పందించకుంటే కఠిన చర్యలు తప్పవు’ అని అందులో బెదిరించారు. దీంతో వారు FIR నమోదు చేశారు. మెయిల్, ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేయగా పాక్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది.
సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. జనవరి 16న బాంద్రాలోని తన ఇంటిలో చోరీకి ప్రయత్నించిన ఓ అగంతకున్ని సైఫ్ అలీఖాన్ అడ్డుకున్నాడు. దీంతో అగంతకుడు సైఫ్ పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కు ఆరు కత్తిపోట్లు పడ్డాయి. గాయాలతో ఉన్న సైఫ్‌ను తెల్లవారుజామున 2.30 గంటలకు ఆటోరిక్షాలో లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో అతనికి రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. దాడి చేసిన దుండగుడు బంగ్లాదేశ్ నివాసి మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (30)ని ముంబై పోలీసులు ఆదివారం థానేలో అరెస్టు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com