Visakhapatnam: ప్రేమించట్లేదని తాను నిప్పంటించుకుని.. అమ్మాయికి నిప్పంటించి..

Visakhapatnam (tv5news.in)
X

Visakhapatnam (tv5news.in)

Visakhapatnam: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు.

Visakhapatnam: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రేమించలేదనే అక్కసుతో యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్​కు చెందిన హర్షవర్ధన్ రెడ్డి.. విశాఖకు చెందిన ప్రత్యూష పంజాబ్‌లో బీటెక్ చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విశాఖ సూర్య బాగ్‌లోని ఓ హోటల్‌లో రూమ్ తీసుకున్న హర్షవర్ధన్ రెడ్డి.. యువతిని మాట్లాడాలని పిలిచాడు. ఆమె వచ్చిన కొద్దిసేపటికి హర్షవర్దన్‌.. తనతో తెచ్చుకున్న పెట్రోల్​ను యువతిపై పోసి నిప్పంటించి, తానూ నిప్పంటించుకున్నాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించి.. వారిని కేజీహెచ్​కి తరలించారు.

ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారని కేజీహెచ్ వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని.. వైద్యం అందిస్తున్నామన్నారు. వీరిద్దరికీ ఇదివరకే పరిచయం ఉండడం, హర్షవర్ధన్ పెళ్లి ప్రపోజల్ తేవడం అందుకు ఆమె ఒప్పుకోకపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని విశాఖ శాంతిభద్రతల డీసీపీ గౌతమిసాలి పరిశీలించారు. రూములో ఉన్న వారి బ్యాగు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డవారి ఇరువురి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు

Tags

Next Story