UP Murder Case : భర్త సొమ్ముతో ప్రియుడు బెట్టింగ్.. షికార్లు

UP Murder Case : భర్త సొమ్ముతో ప్రియుడు బెట్టింగ్.. షికార్లు
X

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీరట్ లో వెలుగుచూసిన మర్చంట్ నేవీ అధికారి హత్య కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు ముస్కాన్, తన భర్త సంపాదించిన డబ్బులను ప్రియుడికిచ్చి బెట్టింగ్ ఆడించినట్లు తెలు స్తోంది. వచ్చిన డబ్బుతోనే వీరిద్దరూ విహారయాత్రను వెళ్లినట్లు సమాచారం. విదేశాల్లో ఉంటున్న సౌరభ తన భార్య, కుమార్తె అవసరాల కోసం ప్రతినెలా రూ.లక్ష చొప్పున పంపించేవాడని దర్యాప్తులో తేలింది. ఆ డబ్బులు తన అకౌంట్ పడగానే ముస్కాన్, తమ ప్రియుడికి చెప్పేదని, వాటితోనే సాహిల్ క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్ పెట్టేవాడని పోలీసువర్గాలు తెలిపాయి. సౌరభ్ హత్యకు పక్కాగా ప్లాన్వేసిన ముస్కాన్, మందుల చీటీని ఫోర్జరీ చేసి నిద్రమాత్రలు సంపాదించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్లాన్ ప్రకారం ఫిబ్రవరి 25నే అతడిని హత్య చేసేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ రోజు సౌరభ్ మద్యం తాగకపోవడం వల్ల ఆ పాచిక పారలేదు. ఆ తర్వాత మార్చి 4న అతడికి నిద్రమాత్రలు ఇచ్చి ప్రియుడితో కలిసి హత్య చేసింది అని పోలీసులు తెలిపారు.

Tags

Next Story