కన్యాదానం టైంలో.. కనిపించకుండా పోయిన వధువు తల్లిదండ్రులు..ఏమైందంటే.?

Bride Family Suicide: పెళ్లికి అంతా సిద్ధమైంది. ఎంతో అంగరంగ వైభవంగా కుమార్తె పెళ్లి చేయాలని అన్నారు.తీరా కన్యాదానం సమయంలో వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. విశాఖలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. అల్లుడి కాళ్లు కడగాల్సిన సమయానికి కనిపించకుండా పోయిన పెళ్లి కూతురు తల్లిదండ్రులు.. ఇంట్లో శవాలుగా తేలారు. మద్దిలపాలంలో రిటైర్డ్ పోర్టు ఉద్యోగి జగన్నాథరావు, భార్య విజయలక్ష్మి కుమార్తెకు వివాహం నిశ్చయించారు. సరిగ్గా కన్యాదానం చేయాల్సిన సమయానికి పెళ్లి మండపం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.
మానసిక సమస్యతో బాధపడుతున్న విజయలక్ష్మి.. చుట్టుపక్కల వాళ్లతో గొడవలు పెట్టుకునేదని తెలుస్తోంది. పెళ్లి రోజు కూడా భర్తతో గొడవపడింది. భార్య ప్రవర్తనతో విసుగుచెందిన జగన్నాథరావు.. ఆమెను చంపి ఉరివేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com