TG : ఫేమస్ అయ్యేందుకు అక్కను చంపిన తమ్ముడు.. రంగారెడ్డి జిల్లా ఘటనలో షాకింగ్ విషయాలు..

గ్రామానికి చెందిన ఓ యువకుడితో చనువుగా ఉంటుందని అతనితో తరచూ ఫోన్ లో మాట్లాడుతోంది అనే కోపం తో ఇటీవలే ఓ తమ్ముడు అక్కను చంపిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. 20 ఏళ్ల యువకుడు తన అక్కను గొంతుకు వైరుతో బిగించి హతమార్చాడు. కాగా పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పెంజర్ల గ్రామానికి చెందిన రుచిత, రోహిత్ లు అక్క తమ్ముళ్లు.21 ఏళ్ల రుచిత అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. వద్దని వారించిన వినకపోవడంతో ఊర్లో పరువు పోతుందని భావించిన రోహిత్ ..రుచిత గొంతును వైరుతో బిగించి హత్య చేశాడు. కాగా అక్కను చంపే ముందు తన సోషల్ మీడియా అకౌంట్ లో రీల్ ను పోస్ట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. "బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా" అనే డైలాగ్ కి యాక్ట్ చేస్తూ రీల్ చేశాడు రోహిత్. దీంతో పథకం ప్రకారమే ఫేమస్ అయ్యేందుకు అక్క రుచిత ను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇలా ఫేమస్ అయ్యేందుకు అక్కను హత్య చేయడం పట్ల పోలీసులు కూడా షాక్ అవుతున్నారు. సామాజిక మాధ్యమాలు యువతను ఎలా పెడదారులు నడిపిస్తున్నాయో చెప్పేందుకు ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com