చేతబడి చేసారన్న అనుమానంతో.. సజీవ దహనం..

X
By - Bhoopathi |3 July 2023 2:00 PM IST
పల్నాడు జిల్లా గుత్తికొండ గ్రామంలో సజీవ దహనం కలకలం రేపుతోంది.యూసఫ్ అనే యువకుడు నరసింహరావును సజీవదహనం చేశారు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మద్యం సేవిద్దామని చెప్పి నరసింహరావును యూసఫ్ తో పాటు అతని స్నేహితుడు అటవీ ప్రాంతంలో తీసుకెళ్లారు. అనంతరం ముగ్గురు కలిసి మద్యం సేవించారు.ఆ తర్వాత నరసింహరావుపై యూసఫ్ పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. తన సోదరుడిని నరసింహరావు కుటుంబం చేతబడి చేసి చంపేసిందని అనుమానించిన యూసఫ్ నరసింహరావును సజీవదహనం చేసినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com