Karimnagar: మైనర్ చేతిలో కారు.. నలుగురు మహిళలు దుర్మరణం.. బ్రేక్ బదులు క్లచ్ తొక్కడంతో..

Karimnagar: మైనర్ చేతిలో కారు.. నలుగురు మహిళలు దుర్మరణం.. బ్రేక్ బదులు క్లచ్ తొక్కడంతో..
Karimnagar: కరీంనగర్‌ కారు యాక్సిడెంట్‌ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి.

Karimnagar: కరీంనగర్‌ కారు యాక్సిడెంట్‌ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఉదయం 7గంటల సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు.. కరీంనగర్‌ కమాన్‌ వద్ద రోడ్డు పక్కన ఉన్న నలుగురు సీస కుమ్మరుల జీవితాలను బలితీసుకుంది. జ్యోతి అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. ముగ్గురు మహిళలు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.

కారు నెంబర్‌ ఆధారంగా.. కారు కరీంనగర్‌కు చెందిన రాజేంద్రప్రసాద్‌గా గుర్తించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం.. కారు యజమాని రాజేంద్రప్రసాద్ కుమారుడే అని పోలీసులు భావిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌ కుమారుడితో పాటు మరో ముగ్గురు మైనర్లు కారులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బ్రేక్ బదులు క్లచ్ నొక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.

కారు యజనామాని సహా నలుగురు మైనర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిర్లక్ష్యంగా మైనర్‌తో కారు నడిపించి నలుగురు ప్రాణాలను బలిగొన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పరారీలో ఉన్నవారిని వెంటనే పట్టుకోవాలని ధర్నా చేశారు. మరో ఇద్దరు క్షతగాత్రులకు ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యం అందుతోంది.

Tags

Read MoreRead Less
Next Story