Gudivada: గోవాలాగా మారిన గుడివాడ.. క్యాసినో సెటప్‌తో మాస్టర్ ప్లాన్..

Gudivada: సంప్రదాయ రీతిలో జరుపుకునే సంక్రాంతి పండక్కి కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో కల్చర్ తీసుకొచ్చారు. గోవాని తలదన్నే రీతిలో గుడివాడలో క్యాసినో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి రచ్చ రచ్చ చేశారు.. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కోడిపందాలు, పేకాటలు దాటి మరో అడుగు ముందుకేసి ఏకంగా క్యాసినోనే పెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది..
సంక్రాంతి సంబరాల ముసుగులో పెద్ద పెద్ద సెట్టింగులు పెట్టి మరీ జూద క్రీడలు జరిగిన తీరు అందరినీ నివ్వెరపోయేలా చేస్తున్నాయి.. ఎవరికి వారే తగ్గేదే లేదంటూ మందేసి చిందేస్తూ క్యాసినో ఆడుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు.. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదంటూ గుడివాడ ప్రజలే అనుకుంటున్న పరిస్థితి. ఎంట్రన్స్ దగ్గర్నుంచి లోపల కల్చరల్ ప్రోగ్రామ్స్ వరకు అంతా గోవాని తలదన్నే రీతిలో కనిపిస్తోంది..
ఎంట్రన్స్‌లో హరిదాసులను ద్వారపాలకులుగా పెట్టారు.. స్పెషల్ లైటింగ్ ఏర్పాటు చేశారు.. స్పెషల్ ఎఫెక్ట్‌గా చీర్ గాల్స్‌ని కూడా పెట్టి డ్యాన్సులు వేయించారు.. ఆ డ్యాన్సులు చూస్తూ పీకల దాకా మందు తాగేందుకు పెద్ద ఏర్పాట్లే చేశారు.. బయటకు ఏదో కల్చరల్ ఈవెంట్ జరుగుతోందని కలరింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయగా.. లోపల ఇంద్రభవనాన్ని తలపించేలా సెటప్ చేశారు.
ఈ పెద్ద పెద్ద గుడారాలకు పైన టెంట్లు వైసీపీ జెండా రంగులను పోలి ఉండటంతో తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. అయితే, ఈ క్యాసినో కహానీ బయటకకు తెలియకుండా నిర్వాహకులు పక్కా జాగ్రత్తలే తీసుకున్నారు.. ఎవరూ వీడియోలు చిత్రీకరించకుండా బౌన్సర్లను కూడా పెట్టారు.. కానీ, కొంతమంది ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని తెలియకుండా సెల్‌ఫోన్లలో బంధించారు.. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. గోవా సంస్కృతి గుడివాడకు తెచ్చారంటూ స్థానికులు ఫైరవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com