విశాఖలో సంచలనం.. 8 పెళ్లిళ్లు చేసుకున్న కేటుగాడు.. !

విశాఖలో సంచలనం.. 8 పెళ్లిళ్లు చేసుకున్న కేటుగాడు.. !
విశాఖలో నిత్య పెళ్లి కొడుకు అరుణ్‌కుమార్ అరాచకాలు సంచలనం రేపాయి. 8 మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని మోసం చేశాడు.

విశాఖలో నిత్య పెళ్లి కొడుకు అరుణ్‌కుమార్ అరాచకాలు సంచలనం రేపాయి. 8 మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని మోసం చేశాడు. ఆపై వ్యభిచారం చేయాలంటూ ఒత్తడికి గురి చేస్తున్నాడని బాధిత మహిళలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకొచ్చింది. గంజాయి అమ్మకం, వ్యభిచార ముఠాతో అరుణ్‌ కుమార్‌కు సంబంధాలున్నాయని బాధితులు చెబుతున్నారు.

అంతేకాదు కొంతమంది మహిళల భర్తలను చంపి.. వారిని బెదిరించి లొంగదీసుకున్నట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. విశాఖ సీపీకి ఆడియో మెసేజ్‌ ద్వారా ఇద్దరు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. విచారణ కోసం స్థానిక కంచెరపాలెం పోలీసులను సీపీ ఆదేశించారు. అయితే స్థానిక పోలీసులు.. తాము ఫిర్యాదు చేసినట్లు అరుణ్‌ కుమార్‌కు సమాచారం ఇచ్చారని.. దీంతో తమను హత్య చేసేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు.

ప్రాణ భయంతో మహిళలు సీపీకి ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అరుణ్‌ కుమార్ నేరాలను అణచివేయకుండా.. పోలీసులే ప్రోత్సహించి నేరగాడిగా తయారుచేసారని ఆరోపించారు. బాధిత మహిళలకు అరుణ్ కుమార్ చేతిలో ప్రాణహాని ఉందని.. వారికి ఏమైనా జరిగితే పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story