Crime : అమరులైన జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కులు అందజేత

Crime : అమరులైన జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కులు అందజేత
X

తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జర్నలిస్టులు విశేషంగా కృషి చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో జర్నలిజం వృత్తిలో అమరులైన జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఇటీవల మరణించిన 18మంది జర్నలిస్టు కుటుంబ సభ్యులకి లక్ష రూపాయల సాయం అందించారు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేస్తారని... ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకొచ్చి... వాటిని పరిష్కరించేలా చేయడంలో జర్నలిస్ట్ ల పాత్ర గొప్పదని తెలిపారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని సీతక్క పునరుద్ఘాటించారు.

Tags

Next Story