Crime : వేడిపాల గిన్నెలో పడి చిన్నారి మృతి

Crime : వేడిపాల గిన్నెలో పడి చిన్నారి మృతి
X

అనంతపురం జిల్లాలోని గురుకుల పాఠశాలలో వేడిపాల గిన్నెలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనకు సంబంధించిన సీసీ టీవీ రికార్డ్ దృశ్యాలను బయటకు వచ్చాయి.. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు వద్ద అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఏజెన్సీ ద్వారా కృష్ణవేణి అనే మహిళ పాఠశాలలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తోంది. వంట గృహంలోకి మహిళా గార్డ్ వెంట తన మూడేళ్ళ కూతురు అక్షిత వెళ్ళింది. చిన్నారి ఆడుకుంటూ వంట గదిలోకి వచ్చింది. అక్కడ గిన్నెలో వేడి పాలు విద్యార్థులకు పంపిణికి చల్లారించాలని ఫ్యాన్ కింద పెట్టారు. చిన్నారి వేడి పాల గిన్నెలో పడి పోవడంతో శరీరం మొత్తం కాలింది. చిన్నారి అరుపులు విన్న తల్లి వెంటనే చిన్నారిని బయటకు తీసింది. పాఠశాల నుండి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ చిన్నారి మృతి చెందింది. విషయం తెలుసుకున్న శింగణమల ఎమ్మెల్యే బండారు శ్రావణి విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. పాఠశాలను డీసీవో జయలక్ష్మీ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story