TG : రూ.20వేలు లంచం తీసుకుంటూ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్

మక్తల్ పట్టణంలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. ఒక రేప్ కేసుకు సంబంధించిన నిందితుడికి అనుకూలంగా చార్జిషీట్ వేయాలనే అంశంపై రూ. 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు నారాయణపేట జిల్లాలోని మక్తల్ పట్టణంలో మంగళవారం రోజు సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడిన సంఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ కు చెందిన సంధ్యా వెంకట రాములు అనే వ్యక్తి మక్తల్ పట్టణంలోని శ్రీనిధి ఫైనాన్స్ సొసైటీ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడిపై రేప్ కేసు నమోదు అయింది. 220/2025 అండర్ 376, 506 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు కావడం జరిగింది. ఈ కేసులో నిందితుడు హైకోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందడం జరిగింది. కండిషన్ బెయిల్పై ఉన్న నిందితుడు ఈ కేసులో తనకు అనుకూలంగా చార్జ్ షీట్ నమోదు చేయాలని స్థానిక సీఐ చంద్రశేఖర్ రూ.20వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆదివారం మక్తల్ సీఐ కార్యాలయంపై ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ, మరో అయిదు మంది అధికారులు దాడి చేసిన సమయంలో కానిస్టేబుల్ నరసింహ నిందితుడి వద్ద నుండి తీసుకున్న 20 వేల రూపాయలను ఏసీబీ అధికారులు రికవరీ చేశారు. సీఐ చంద్రశేఖర్ ఆదేశాల మేరకే రూ.20 వేలు తీసుకున్నట్లు కానిస్టేబుల్ వెల్లడించడంతో సీఐ చంద్రశేఖర్తో పాటు కానిస్టేబుల్ నరసింహ, శివారెడ్డిలను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ బాలకృష్ణ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com