Cricket Players : శుభ్ మన్ గిల్ కు సీఐడీ నోటీసులు

భారత క్రికెటర్ కు గుజరాత్ సీఐడీ విభాగం నోటీసులు జారీ చేసింది. రూ. 450 కోట్ల కుంభకోణంలో ఆయనను విచారించను న్నట్టు నోటీసుల్లో పేర్కొంది. గుజరాత్ టైటాన్స్ (జిటి) క్రికెట్ జట్టుకు చెందిన ముగ్గురు ఆట గాళ్లు, కెప్టెన్ శుభ్ మన్ గిల్ కు ఈ నోటీసులు అందాయి. బిజెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఫోన్ జీ స్కీం (చైన్ మార్కెటింగ్) కింద శుభ్ మన్ గిల్ రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టారు. మిగిలిన ముగ్గురు ఆటగాళ్లు సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, రాహుల్ తెవాటియారూ. 10 లక్షల నుండి రూ. 1 కోటి వరకు పెట్టుబడులు పెట్టారు.సంప్రదాయ బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ ఇస్తామని సదరు సంస్థ నమ్మ బలికింది. దీంతో వీళ్లు పెట్టుబడులు పెట్టారు. ఈ సంస్థపై ఇప్పటికే కేసు నమోదు చేసిన గుజరాత్ సిఐడీ విభాగం.. తొలుత ఇది రూ.6 వేల కోట్ల కుంభకోణమని భావించింది. తర్వాత దానిని రూ. 450 కోట్లకు సవరించింది. ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టులో చోటు కోల్పోయిన గిల్.. ఈ నోటీసులు రావడంతో షాక్ కు గురయ్యారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం గిల్ ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆయన స్వదేశానికి చే రుకున్న తర్వాత విచారించే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com