సహ నటుడి మోసం.. ప్రేమ పేరుతో లైంగికదాడి..

సహ నటుడి మోసం.. ప్రేమ పేరుతో లైంగికదాడి..
యువతి గర్భం ధరించడంతో అతడిని పెళ్లి చేసుకోమని కోరింది. కానీ అతడు అందుకు ససేమిరా అన్నాడు.

తనలాగే సినిమాల్లో అవకాశాల కోసం నగరానికి వచ్చాడనుకుని పరిచయం పెంచుకుంది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. యువతి గర్భం ధరించడంతో అతడిని పెళ్లి చేసుకోమని కోరింది. కానీ అతడు అందుకు ససేమిరా అన్నాడు.

దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. జుబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతి ఆరు నెలల కిందట నగరానికి వచ్చి నల్లకుంట ప్రాంతంలో తన సోదరితో కలిసి ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. కొద్ది నెలల కిందట సినిమాలో నటించే అవకాశం రావడం, అక్కడ షూటింగ్ సమయంలో సహనటుడు మాలపాటి రామకృష్ణతో పరిచయం ఏర్పడింది.

ప్రేమ పేరుతో ఇద్దరూ దగ్గరయ్యారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెహ్మత్ నగర్‌లో ఉన్న అతడి రూమ్‌లో యువతిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె గర్భం దాల్చడంతో భవిష్యత్ దెబ్బతింటుందని ఆమెకు గర్భస్రావ మాత్రలు ఇచ్చాడు.

అనంతరం ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. తీవ్ర దుర్భాషలాడుతూ పలు మార్లు ఆమెపై చేయి చేసుకుని పెళ్లి చేసుకోనని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రామకృష్ణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story