బంధువు అంత్యక్రియలకు వచ్చి.. రోడ్డు ప్రమాదంలో నలుగురు అన్నదమ్ములు..

బంధువు అంత్యక్రియలకు వచ్చి.. రోడ్డు ప్రమాదంలో నలుగురు అన్నదమ్ములు..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ సిద్ధిపేట జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ సిద్ధిపేట జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు. మరణించిన నలుగురూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు. మృతులు ఎరుకుల కృష్ణ, సంజీవ్, సురేష్, వాసుగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వచ్చి సూరత్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

బ్రతుకుదెరువు కోసం అన్నదమ్ములు నలుగురూ కొన్నేళ్ల క్రితం గుజరాత్ లోని సూరత్ కు వెళ్లారు. ఐదురోజుల క్రితం చౌటపల్లిలో బంధువు ఎరుకల రాములు మృతి చెందారు. దీంతో అతడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చారు. తిరిగి సూరత్ వెళ్లేందుకు కారులో ప్రయాణమయ్యారు నలుగురు అన్నదమ్ములు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story