Ganja : గంజాయి అమ్ముతున్న దంపతుల అరెస్ట్

X
By - Manikanta |3 Oct 2024 2:30 PM IST
గంజాయి అమ్ముతున్న దంపతులను ఎల్ బీనగర్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా ముటుకూరు గ్రామానికి చెందిన యరపతి గోపి ( 25), చల్లా ఉమా మహేశ్వరి (24) ఇద్దరు భార్య భర్తలు. వీరు మాచర్ల గ్రామానికి చెందిన చల్లా శివనాగరాజు వద్ద నుంచి గంజాయిని సిటీకి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఈ నెల 1న ఎల్ బీనగర్ లోని హ్యూండాయ్ షోరూం వద్ద గోపి, ఉమా మహేశ్వరి ఇద్దరూ కలిసి తంగెళ్ల ప్రభుచరణ్ అనే వ్యక్తికి గంజాయి అమ్ముతుండగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి 8 గంజాయి ప్యాకెట్లు, ఓ బైక్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com