క్రైమ్

కంటి డాక్టర్.. ఖతర్నాక్ ఐడియా.. రూ.9 లక్షలకు టోకరా

మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా అని కమ్మగా మాటలు చెప్పి ఆమెను పెళ్లికి ఒప్పించాడు

కంటి డాక్టర్.. ఖతర్నాక్ ఐడియా.. రూ.9 లక్షలకు టోకరా
X

ఏమండి.. మీ ఫ్రొఫైల్ నచ్చింది. మీకు ఓకే అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా.. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా అని కమ్మగా మాటలు చెప్పి ఆమెను పెళ్లికి ఒప్పించాడు స్కాట్ లాండ్ లోని ఓ కంటి వైద్యుడు. మీకు ఓ వజ్రాల హారం కానుకగా పంపించాలనుకున్నానని తియ్యగా కబుర్లు చెప్పాడు. మాటల మధ్యలో తనకు డబ్బు అవసరం ఉందంటూ అడపా దడపా మొత్తం ఓ రూ.9 లక్షలకు టోకరా వేశాడు.

మోసపోయానని తెలుసుకున్న ఆమె సైబర్ సెల్ కి కంప్లైంట్ చేసింది. సైబర్ క్రైమ్ ఏసీపీ వివరాల ప్రకారం బాధితురాలు ఓ ప్రైవేటు ఉద్యోగి. భర్త మరణించగా ఒంటరిగా ఉంటున్న ఆమెను మళ్లీ పెళ్లిచేసుకోమంటూ తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. ఆమె అంగీకారంతో మాట్రిమోనీలో వివరాలు ఉంచారు. ఓ వ్యక్తి ఆమె వివరాలు చూసి తన పేరు క్లిఫర్డ్ అని తాను పంజాబ్ కు చెందిన వ్యక్తి అని, ప్రస్తుతం ఐరోపాలో స్థిరపడ్డానని చెప్పాడు.

తల్లి కోరిక మేరకు దక్షిణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. పెళ్లికి ముందు బంగారు, వజ్రాల హారం కానుకగా పంపుతున్నానని నమ్మించాడు. శంషాబాద్ విమానాశ్రయానికి పార్సిల్ పంపానని చెప్పాడు. తీరా చూస్తే పార్సిల్ లేదు, వజ్రాల హారమూ లేదు. దాంతో ఆమె మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story

RELATED STORIES