Cyber Crime : సైబర్ క్రైమ్ గ్యాంగ్ అరెస్ట్
అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ గ్యాంగ్‌ను తొలిసారి అరెస్ట్ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. రాజస్థాన్, జైపూర్, జోధ్‌పూర్‌లలో ఈ ఆపరేషన్ నిర్వహించామని, 15 రోజుల అపరేషన్‌లో భాగంగా 27 మంది సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు అందరూ విద్యావంతులేననని, మొత్తం ముప్పై ఏళ్ళ లోపు వారే ఉన్నారని తెలిపారు. ఒక్కొక్కరు పదుల కేసుల్లో నిందితులుగా ఉన్నారని, ఈ 27 మందిపై తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులు నమోదైనట్లు శిఖా గోయల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 2023 కేసులో వీరు నిందితులుగా ఉన్నారన్నారు. నిందితుల నుంచి 31 మొబైల్ ఫోన్స్, 37 సిమ్ కార్డ్స్, చెక్ బుక్స్‌లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులు 29 మ్యూల్ అకౌంట్‌లను సైబర్ క్రైమ్స్ కోసం సేకరించారని తెలిపారు.
11 కోట్లు లావాదేవీలు 29 అకౌంట్ల ద్వారా నిందితులు చేశారని, విచారణలో లావాదేవీల జరిపిన మొత్తం అమౌంట్ పెరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులో నిందితులు రూ. 9 కోట్లు కొల్ల గొట్టారని, నిందితులను అరెస్ట్ చేయడానికి లోకల్ పోలీసుల సహకరించారన్నారు. సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్ ఇది లాస్ట్ ఆపరేషన్ కాదు మొదటిదన్నారు. సైబర్ నేరగాళ్ల కొల్లగొట్టిన రూ. 114 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం బాధితులకు తిరిగి ఇచ్చామని, సైబర్ నేరగాళ్లు మోసం చేస్తే వెంటనే కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మ్యూల్ అకౌంట్‌లను ఓపెన్ చేసేముందు క్రాస్ చెక్ చేయాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com