Cyber Criminals : రైతుల సొమ్ముపై సైబర్ నేరగాళ్ల కన్ను.. సర్కార్ అలర్ట్

Cyber Criminals : రైతుల సొమ్ముపై సైబర్ నేరగాళ్ల కన్ను.. సర్కార్ అలర్ట్
X

రాష్ట్రంలో రుణమాఫీ సొమ్ము జమ కావడంతో తెలంగాణ రైతుల్ని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరుగుతున్న వేళ సైబర్ నేరగాళ్లు రెచ్చి పోయే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.

ఈ మేరకు తాజాగా సైబర్ సెక్యూరిటీ అధికారులు ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఫోన్లలో అనవసరమైన లింకులపై క్లిక్ చేయొద్దని రైతుల్ని హెచ్చరిస్తోంది. రైతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కీలక సూచన చేసింది. గత కొంతకాలంగా వాట్సాప్ లో ఏపీకే లింకులు పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు.

ఇటీవల కాలంలో ఆర్టీవో అధికారులు, బ్యాంకుల పేరిట ఆ లింకులు వస్తున్నాయని, వాటిని క్లిక్ చేసి చాలామంది మోసపోతున్నారని సైబర్ సెక్యూరిటీ అధికారులు వివరిస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి లింకులు వస్తే క్లిక్ చేయొద్దని సైబర్ సెక్యూరిటీ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.

Tags

Next Story