Sitara Gattamaneni : మహేష్ కూతురు సితారకు సైబర్ కష్టాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) కూతురు సితారకు (Sitara) కూడా సైబర్ కష్టాలు మొదలయ్యాయి. సితార పేరుతో సైబర్ నేరగాళ్లు ఇతరులకు ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపించి డబ్బులు దండుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో కొంతమంది కేటుగాళ్లు ఫేక్ లింక్స్ పంపుతున్నారు. ఆ లింక్ క్లిక్ చేసిన వారి అకౌంట్ నుంచి నగదును కాజేస్తున్నారు.
దీనిని మహేశ్ బాబు టీమ్ (GMB) గుర్తించింది. అలాంటి వాటిని ఎవరూ నమ్మొద్దని వారు తెలిపారు. సితారకు ఉన్న ఏకైక ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ను అక్కడ చేర్చుతూ మాదాపుర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా సెలబ్రిటీల పేరుతో అనుమానస్పద లింకులు వస్తే అందరూ అప్రమత్తంగా ఉండాలని జీఎంబీ తెలిపింది.
ఈ అంశాన్ని తాజాగా నమ్రత (Namrata) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్ విడుదల చేశారు. మహేష్ బాబు టీమ్ ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అనుమానస్పద నోటిఫికేషన్‌కు స్పందించవద్దని అభిమానులకు మహేష్ టీమ్ సూచిస్తుంది. త్వరలోనే ఆ సైబర్ నేరగాళ్లను పట్టుకుంటామంటున్న సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.
సితార ఘట్టమనేనికి (Sitara Gattamaneni) సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ విషయాలు, రీల్స్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం సితారకు ఇన్ స్టాలో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com