క్రైమ్

Tamilnadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంపీ కుమారుడు మృతి

Tamilnadu: డీఎంకే రాజ్యసభ ఎంపీ ఎన్‌ఆర్‌ ఇలంగోవన్‌ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు

Tamilnadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంపీ కుమారుడు మృతి
X

Tamilnadu: గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో డీఎంకే రాజ్యసభ ఎంపీ ఎన్‌ఆర్‌ ఇలంగోవన్‌ కుమారుడు మృతి చెందారు.

తమిళనాడుకు చెందిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) రాజ్యసభ ఎంపీ ఎన్‌ఆర్‌ ఇళంగోవన్‌ కుమారుడు 22 ఏళ్ల రాకేష్‌ గురువారం రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

మంత్రి కుమారుడు మరో ప్రయాణికుడితో కలిసి పుదుచ్చేరి నుంచి చెన్నైకి వెళ్తున్నారు. వాహనం రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో రాకేష్‌ మృతి చెందగా, మరో ప్రయాణికుడికి తీవ్రగాయాలయ్యాయి.

ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మాజీ సీనియర్ న్యాయవాది అయిన NR ఇలంగోవన్ 2020లో తమిళనాడు నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

Next Story

RELATED STORIES