Doctor : డాక్టర్‌కు టెలిగ్రామ్ ట్రేడింగ్ టోకరా.. రూ.50లక్షలు హుష్ కాకి

Doctor : డాక్టర్‌కు టెలిగ్రామ్ ట్రేడింగ్ టోకరా.. రూ.50లక్షలు హుష్ కాకి

హైదరాబాద్ నగరంలో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ను సైబర్ నేరగాళ్లు మోసగించారు. ఏకంగా రూ.43.7 లక్షలు అతని నుండి దోచుకున్నారు. ఈ ఏడాది జూన్ లో వైద్యుని మొబైల్ కు సైబర్ నేరగాళ్లు ఒక లింక్ ను పంపించారు. సదరు వైద్యుడు సెక్యూరిటీస్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో వచ్చిన వాట్సాప్ లింక్ ను క్లిక్ చేశాడు. అందులో ట్రేడింగ్ కి సంబంధించిన ప్రమోషన్ తో పాటు ఇతర గ్రూప్ సభ్యులు తమ సక్సెస్ స్టోరీని షేర్ చేస్తున్న ఒక టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అయిపోయాడు. అందులో ఉన్న కథలను నిజం అనుకొని నమ్మిన డాక్టర్ తాను కూడా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు.

ఈ గ్రూపులో ఇచ్చిన సలహాలు, స్టోరీలు నిజమేమో అని అనుకుని నమ్మిన బాధితుడు 50 శాతం డిస్కౌంట్ కింద ఎక్కువ షేర్లను కొనుగోలు చేశాడు. అయితే మొదట అతడికి ప్రాఫిట్ సైతం సైబర్ నేరగాళ్లు చూపించారు. డబ్బులు వస్తున్నాయని ఆనందంతో రెండు నెలల వ్యవధిలో సుమారు రూ.50 లక్షలకు పైగా నగదును ట్రేడింగ్ చేశాడు. మొత్తం రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టి రూ.6 కోట్లకు పైగా ప్రాఫిట్ సాధించాడు. అయితే రూ.6 కోట్లకు బదులు కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకునే వెసులుబాటును సైబర్ నేరగాళ్లు కల్పించారు. ఇదేంటని బాధితుడు వారిని ప్రశ్నిస్తే మరొక 25 శాతం ప్రాఫిట్ టాక్స్ కడితే మిగతా డబ్బులు కూడా విత్ డ్రా చేసుకోవచ్చు అంటూ నమ్మించారు. అనుమానం వచ్చిన బాధితుడు తాను మోసపోయానని గ్రహించి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

Tags

Next Story