Telangana : డాక్టర్ దగ్గర గంజాయి సీజ్.. అరెస్ట్

X
By - Manikanta |18 Jun 2025 6:30 PM IST
వికారాబాద్లో ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తున్న డాక్టర్ వద్ద పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ వద్ద 65 గ్రాముల గంజాయి పట్టుబడింది. ఆయన అతిర అనే ప్రైవేటు ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. వికారాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ వద్ద గంజాయి దొరకడంపై స్థానిక ప్రజలు, నెటిజన్లు డాక్టర్ ను తిడుతూ కామెంట్లు పెడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com