మెదక్​ జిల్లాలో ఇద్దరి దారుణ హత్య

మెదక్​ జిల్లాలో ఇద్దరి దారుణ హత్య

మెదక్ జిల్లాలోని వేర్వేరు చోట్ల ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేట మండలం ఉసిరికపల్లికి చెందిన ఎరుకలి నరసింహులు రోజూలాగే మంగళవారం డ్యూటీకి వెళ్లాడు. రాత్రి 10 గంటలకు తిరిగి రాగా, ఆ టైంలో గ్రామానికి చెందిన ఎరుకలి వెంకటేశ్ తన ఇంట్లో ఉండటాన్ని చూసి కోపంతో ఊగిపోయాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో కత్తితో వెంకటేశ్​పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్​పెద్దగా కేకలు వేస్తూ, పాకుతూ పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించాడు. కత్తితో గొంతు కోసి చంపేశాడు. వెంకటేశ్​తండ్రి నాగయ్య అడ్డురాగా అతనిపై కూడా దాడికి యత్నించాడు. మృతుడు వెంకటేశ్, నరసింహులు అన్నదమ్ముల పిల్లలు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న తూప్రాన్ సీఐ కృష్ణ, శివ్వంపేట ఎస్సై మైపాల్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే, తాను వెంకటేశ్​ను చంపానని నరసింహులు బుధవారం పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు.

పోతిరెడ్డిపల్లిలో సబ్​స్టేషన్​ఆపరేటర్​

కొల్చారం మండల పోతిరెడ్డిపల్లి సబ్​స్టేషన్​ఆపరేటర్​ను మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. ఎస్సై మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్​కు చెందిన నరేశ్(35) పోతరెడ్డిపల్లి సబ్ స్టేషన్​లో ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. రోజూలాగే మంగళవారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై పదునైనా కత్తితో దాడిచేసి చంపేశారు. మృతుడు నరేశ్​పదేండ్ల కింద ఉప్పులింగాపూర్​కు ఇల్లరికం వచ్చాడు. భార్య విజయలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఘటనా స్థలాన్ని మెదక్ డీఎస్పీ ఫణీంద్ర, రూరల్​సీఐ కేశవులు పరిశీలించారు. విజయలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story