Rangareddy District : జంట హత్యల కలకలం .. వివాహేతర సంబంధమే కారణం!

Rangareddy District : జంట హత్యల కలకలం .. వివాహేతర సంబంధమే కారణం!
X

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు కలకలం రేపాయి. పుప్పాలగూడలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ గుట్టల వద్ద యువతి, యువకుడి డెడాబాడీలను పోలీసులు గుర్తించారు. చత్తీస్గ డ్కు చెందిన వివాహిత బిందుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమెకు మధ్యప్రదేశ్కు చెందిన అంకిత్ సాకేత్ తో పరిచయం ఏర్ప డింది. ఇరువురి మధ్య కొంతకాలంగా వివా హేతరం సంబంధం కొనసాగుతోంది. అయితే ఈనెల 11న బిందును సాకేత్ ఎల్బీనగర్ నుంచి నానక్ రామ్ గూడకు పిలిపించాడు. ఆమెను తన ఫ్రెండ్ రూమ్లో ఉంచాడు. తర్వాత ఇద్దరు కలిసి పుప్పాలగూడ గుట్టల వద్దకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, సాకేతు తె లియకుండా మరో యువకుడితో బిందు ప్రేమా యణం సాగించింది. మరో ప్రియుడు.. వీరిద్దరి

ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బిందుపై దాడి చేశాడు. బండరా ళ్లతో బాది హత్య చేశాడు. అక్కడి నుంచి పారి పోతున్న సాకేత్పై సైతం అటాక్చేశాడు. తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. అనంతరం ఇద్దరి ముఖాలపై బం డరాయితో దాడి చేసి ప్రియుడు పరారయ్యాడు. హంతకుడి కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. వీరిద్దరి హత్య కన్నా ముందు ఈనెల 3న బిందు అదృశ్యమైనట్లు వనస్థలిపు రంలో, అంకిత్ సాకేత్పై ఈనెల 8న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది.

Tags

Next Story