Dowry harassment : మహిళా డాక్టర్‌కు తప్పని వరకట్న వేధింపులు... కన్నబిడ్డతో అత్తగారింటికి వెళ్తే...!

Dowry harassment : కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించి అందరి హృదయాలను గెలుచుకున్న ఆ డాక్టర్ కు మాత్రం అత్తారింట్లో నిరాదరణే ఎదురైంది. కన్నబిడ్డతో సంతోషంగా అత్తారింట్లో అడుగుపెట్టాలనుకున్న ఆమెను అత్తింటివారు నిర్ధాక్షిణ్యంగా గెంటేశారు. సాటి సాధారణ మహిళలలాగే ఉన్నత విద్య చదువుకున్న డాక్టర్ కు సైతం వరకట్న వేధింపులు ఎదురయ్యాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో చోటు చేసుకుంది. డాక్టర్ తేజస్వినికి శ్రీకాళహస్తికి చెందిన డాక్టర్ విక్రమ్ రావుతో 2016లో వివాహమైంది. పెళ్లి తర్వాత కొద్దికాలానికి ఇద్దరూ లండన్ కు వెళ్లారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో చంటి బిడ్డతో సహా లండన్ నుంచి తల్లిగారింటికి డాక్టర్ తేజస్విని తిరిగివచ్చారు.
తిరిగి కాపురం కోసం తన బిడ్డతో అత్తగారింటికి చేరుకున్న డాక్టర్ తేజస్వినిని ఇంట్లోకి రానివ్వకుండా అత్తింటివారు అడ్డుకున్నారు. రెండు కోట్ల అదనపు కట్నం డిమాండ్ చేయడంతో డాక్టర్ తేజస్విని... అత్తింటిముందు ఆందోళనకు దిగారు. తనకు న్యాయం చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.... తేజస్విని స్టేట్ మెంట్ తీసుకున్నారు.రెండు కోట్ల అదనపు కట్నం తీసుకురమ్మని భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారని.. తనను, తన బిడ్డను ఇంటి ఉంచి గెంటివేశారని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు కన్నీరుమున్నీరైంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com