చిన్నారిని నేలకేసికొట్టి చంపిన తండ్రి

చిన్నారిని నేలకేసికొట్టి చంపిన తండ్రి
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న తండ్రి కన్న ప్రేమను మరిచి కర్కశంగా వ్యవహరించాడు

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న తండ్రి కన్న ప్రేమను మరిచి కర్కశంగా వ్యవహరించాడు. అల్లారు ముద్దుగా పెంచాల్సిన బాధ్యతను మరిచి పసికందు ప్రాణాలను చిదిమేశాడు. ఈ అమానుష ఘటణ మంగళగిరి మండలం నవులూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మునగాల గోపి అనే వ్యక్తికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే భార్య ఒక కుమార్తెను తీసుకొని విజయవాడకు వెళ్లింది. ఈ నేపథ్యంలో మద్యం సేవించిన గోపి రెండున్నరేళ్ల వయసు ఉన్న తన కుమార్తెను నేలకేసి బలంగా కొట్టాడు. దీంతో చిన్నారి తలకు తీవ్రంగా గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు గోపిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story