Hyderabad Crime : ఇంజినీరింగ్ అమ్మాయిపై డ్రైవర్ అత్యాచారం

X
By - Manikanta |17 Jan 2025 4:15 PM IST
హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నంలోని ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న యువతి మంగళపల్లిలోని ఓ హాస్టల్ ఉంటోంది. సెమిస్టర్ ఉండడం వల్ల హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. బుధవారం రాత్రి 11గంటల సమయంలో ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న అజిత్ హాస్టల్లోకి చొరబడ్డాడు. బాధితురాలు గదిలో ఒంటరిగా ఉండడం చూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు రాత్రి 12.38 నిమిషాలకు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. కేసు నమోదు చేసి, నిందితుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com