Drugs Seized : యాదగిరిగుట్టలో డ్రగ్స్ కలకలం

Drugs Seized : యాదగిరిగుట్టలో డ్రగ్స్ కలకలం
X

యాదగిరిగుట్టలో భారీగా నిషేధిత సింథటిక్‌ డ్రగ్‌ పట్టుకున్నారు పోలీసులు. 120 కిలోల ఎఫిడ్రిన్‌ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 24 కోట్లు ఉంటుందని తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. రామోజీపేటలోని యాదాద్రి లైఫ్‌ సైన్సెన్‌ కెమికల్ ఫ్యాక్టరీలో తయారు చేసినట్లు తేలడంతో ఉదయం నుండి పోలీసులు కంపెనీల తనిఖీలు చేపట్టారు. ఈ డ్రగ్స్‌ గూడూరు టోల్‌ ప్లాజా వద్ద స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు కృష్ణారెడ్డి, అహ్మద్‌, సునీల్‌ను అరెస్ట్‌ చేసి..దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Tags

Next Story