Hyderabad : రూ.1.6 కోట్ల డ్రగ్స్ సీజ్.. ముగ్గురు విదేశీయులు అరెస్ట్

హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. రూ.1.60 కోట్ల విలువైన 1300 ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముగ్గురు విదేశీయులను అరెస్ట్ చేశారు. నగరంలో ముగ్గురు విదేశీయులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. దీంతో లంగర్ హౌస్, హుమాయున్ నగర్ పోలీసులు బుధవారం సంయుక్తంగా ఆపరేషన్ ను చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1.60 కోట్ల విలువైన 1300 ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ తో కలిసి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ లో డ్రగ్స్ ను సరఫరా చేయడానికి డ్రగ్ పెడ్లర్లు వచ్చినట్లు సమాచారం అందిందని తెలిపారు. నిందితుడు 2009లో బిజినెస్ వీసాపై ఇండియాకి వచ్చాడనీ.. 2013లోనే నిందితుడి వీసా గడువు ముగిసిందని తెలిపారు. ఇండియాకి వచ్చిన తరువాత డ్రగ్స్ దందా చేస్తూ ఉన్నట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com