Heera Group Scam : హీరా గ్రూప్‌ కేసులో ఈడీ దూకుడు..

Heera Group Scam : హీరా గ్రూప్‌ కేసులో ఈడీ దూకుడు..
X

హీరా గ్రూప్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. శనివారం హైదరాబాద్లో మరోసారి రైడ్స్ చేపట్టింది. నౌహిరా షేక్‌ ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలు నిధులు గోల్‌మాల్‌ జరిగినట్లు ఈడీ గుర్తించింది. విదేశీ పెట్టుబడులపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా ఈ కేసులో నౌహిరా ఆస్తులను ఒక్కొక్కటిగా ఈడీ అటాచ్‌ చేస్తోంది. టోలీ చౌక్‌లోని 81 ప్లాట్‌లను స్వాధీనం చేసుకున్న ఈడీ.. ఇప్పటివరకు రూ.380 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మరో రూ.600 కోట్లపై చిలుకు ఆస్తులపై విచారణ జరుపుతోంది. దేశవ్యాప్తంగా నౌహిరా షేక్‌పై 60కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నౌహీరా షేక్‌పై గతంలో కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగానే ఈడీ రైడ్స్ చేపట్టింది.

Tags

Next Story