Eluru : ఏలూరు సీఐ బాలరాజు సస్పెండ్‌.. యువతిపై లైంగిక దాడి ఆరోపణలు

Eluru : ఏలూరు సీఐ బాలరాజు సస్పెండ్‌.. యువతిపై లైంగిక దాడి ఆరోపణలు
యువతిపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో సీఐ బాలరాజును సస్పెండ్ చేస్తున్నట్లు డీఐజీ మోహన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సీఐ బాలరాజు సస్పెండ్‌ అయ్యారు. యువతిపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో సీఐ బాలరాజును సస్పెండ్ చేస్తున్నట్లు డీఐజీ మోహన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఘటనపై విచారణకు ఆదేశించారు. వన్‌టౌన్‌ సీఐగా విధుల నిర్వర్తిస్తున్న సమయంలో బాలరాజు వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు డీఐజీ మోహన్‌రావు.

Tags

Read MoreRead Less
Next Story