TG : కంపెనీ లెక్కల్లో 5 లక్షల తేడా.. ఉద్యోగిని రూమ్ లో పెట్టి బంధించారు.

కంపెనీ లెక్కల్లో రూ. 5 లక్షలు తేడాలు వచ్చాయంటూ తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగిని గదిలో నిర్భందించి దాడికి పాల్పడ్డారు. వరంగల్ బుస ప్రియాంక్ అనే యువకుడు జనవరిలో సుచిర్ ఇండియా సంస్థలో మేనేజర్గా ఉద్యోగంలో చేరాడు. ఇటీవల నిర్వహించిన ఆడిటింగ్లో వరంగల్ వెంచర్క సంబంధించిన లెక్కల్లో రూ.5 లక్షలు అవకతవకలు జరిగినట్లు తేలింది. ఈ మొత్తాన్ని ప్రియాంక్ తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని గురించి మాట్లాడదామంటూ సుచిర్ ఇండియా జీఎం మధుసూదన్ నిన్న ప్రియాంక్ ను పిలిచారు. ఇద్దరు కలిసి జంజారాహిల్స్ నంది నగర్ లోని సుచిర్ ఇండియా సీఈవో కిరణ్ కు ఆఫీసుకు వచ్చారు. కాసేపటికి అక్కడికి వచ్చిన సీఈవో కిరణ్.. డబ్బులు ఏం చేసావ్ .. అంటూ దుర్భా షలాడాడు. మర్యాదగా రూ.5 లక్షలు కట్టకపోతే అంతు చూస్తానంటూ బెదిరింపులకు గురి చేశారు. సాయంత్రం దాకా గదిలో కూర్చోబెట్టి బయటకు వెళ్లాడు. కిరణ్ బయటకి వెళ్లిన తర్వాత ప్రియాంక్ డయల్ 100 కి కాల్ చేసి తనను గదిలో బంధించారు అని ఫిర్యాదు వేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని విడిపించారు. బాధితుడు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కంపెనీ సీఈవో కిరణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com