Mancherial District : రూ.9 లక్షల నకిలీ పత్తి విత్తనాలు సీజ్

మంచిర్యాల జిల్లా మందమర్రి సర్కిల్ పరిధి కాసిపేట మండలం స్వల్పలవా గు పరిసరాల్లో పోలీసులు రూ. 9,12,500 విలువైన 365 కిలోల నకిలీ విత్తనాలను పట్టు కున్నారు. ఇవాళ మందమర్రి పీఎస్ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణానికి చెందిన అబ్దుల్ రజాక్ గుజరాత్ నుంచి నకిలి పత్తి విత్తనాలు తీసుక వచ్చి మందమర్రి సర్కిల్ పరిధిలోని గ్రామాల రైతులకు విక్రయిస్తున్నాడు. మందమర్రికి చెందిన సాహెబ్ జానీ, చంద్రయ్య, బాలకృష్ణ,తిరుపతి, బొలిశెట్టి జనార్ధన్ లు పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు అమ్మాడు. నిందితులు భైంసాకు చెందిన అబ్దుల్ రజాక్, మందమర్రి మండలానికి చెందిన కాసీపాక తిరుపతి, బొలిశెట్టి జనార్ధన్ లను అరెస్టు చేశారు. కాసీపేట మండలం దేవాపూర్ చింతగూడ గ్రామ శివారులోని సల్పలవాగు పరిపరాల్లో దాచిపెట్టిన 315 కిలోల నకిలీ విత్తనాలను, అందుకు ఉపయోగించిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు పంపించినట్లు ఏసీపీ తెలిపారు. నకిలీ విత్తనాలను రైతులు కొనుగోలు చేయవద్దని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com