Fake Police Station : ఫేక్ పోలీస్ స్టేషన్.. ఏడాది పాటు యథేచ్ఛగా దందాలు

Fake Police Station : ఫేక్ పోలీస్ స్టేషన్.. ఏడాది పాటు యథేచ్ఛగా దందాలు
X

ఓ వ్యక్తి ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాడు. ఏడాది పాటు యథేచ్ఛగా దందాలు చేశాడు. ఈ ఘటన పూర్ణియా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మోహని గ్రామంలో రాహుల్ కుమార్ షా అనే వ్యక్తి ఫేక్ పోలీస్ స్టేషన్ ప్రారంభించాడు. ఉద్యోగాల ముసుగులో ఆ గ్రామంలోని యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. గ్రామీణ రక్షాదళ్ రిక్రూట్మెంట్ పేరుతో కానిస్టేబుల్, చౌకీదార్ నియమకాలు చేపట్టాడు. ఇందుకోసం స్థానిక యువత నుంచి రూ.25 వేల నుంచి 50 వేల రూపాయల వరకు వసూలు చేశాడు. ఇలా నియమితులైన 300 మందికి పోలీసు యూనిఫాంలు, లాఠీలు, నకిలీ ఐడీ కార్డులు సైతం అందజేశాడు. వారితో పెట్రోలింగ్, లిక్కర్ అక్రమ రవాణాపై దాడులు చేయించాడు. ఇలా నియమితులైన ఫేక్ పోలీసులు నిందితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. వచ్చిన డబ్బులో సగం తాను తీసుకొని.. మిగతా సగాన్ని తన కింది ఉద్యోగులకు అతడు అందజేసేవాడు. దాదాపు ఏడాది ఇలా నకిలీ పోలీసుల ఆగడాలు కొనసాగాయి. అయితే, ఎట్టకేలకు గుట్టు బయటపడటంతో రాహుల్ కుమార్ షా పరారయ్యాడు. అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Tags

Next Story