TG : గంజాయి అమ్ముతున్న కుటుంబం అరెస్ట్

TG : గంజాయి అమ్ముతున్న కుటుంబం అరెస్ట్
X

గంజాయిని అక్రమంగా అమ్ముతూ యువతను పక్కదారి పట్టిస్తున్న ఓ ఫ్యామిలీని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 29న నర్సాపూర్ పట్టణానికి చెందిన కూనపులి వికాస్, అతని తండ్రి కూనపులి రమేష్, తల్లి కూనపులి సరస్వతిలు అక్రమంగా నర్సాపూర్ శివాలయం వీధి సమీపంలో కొంతమంది యువకులకు గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 2,000 వేల విలువగల 94 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు నర్సాపూర్ ఎస్సై లింగం తెలిపారు. వారిపై ఎన్ డి పి ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

Tags

Next Story