Bhadradri Kothagudem: కుటుంబం సజీవ దహనం కేసులో ఎమ్మెల్యే కుమారుడి చుట్టూ ఉచ్చు..

Bhadradri Kothagudem: కుటుంబం సజీవ దహనం కేసులో ఎమ్మెల్యే కుమారుడి చుట్టూ ఉచ్చు..
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం సజీవ దహనం కేసు అనేక మలుపులు తీసుకుంటోంది.

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం సజీవ దహనం కేసు అనేక మలుపులు తీసుకుంటోంది. ఆత్మహత్య అనుకున్నది కాస్తా హత్యగా తేలి చివరకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావ్ కుమారుడు వనమా రాఘవ చుట్టు ఉచ్చు బిగిస్తోంది. అతనిపై కేసు నమోదు వరకూ వెళ్లింది. వంట గ్యాస్ లీక్ వల్లే ఈ దారుణం జరిగిందని అంతా భావించారు.

కానీ ఆర్ధిక సమస్యలతోనే రామకృష్ణ తన కుటుంబాన్ని పెట్రోల్ పోసి దహనం చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. రామకృష్ణ సూసైడ్ నోట్‌ వనమా రాఘవకు ఈ కేసుతో ఉన్న లింక్ ను బయట పెట్టింది. రామకృష్ణ ఆత్మహత్యకు వనమా రాఘవే ప్రధాన కారమణమని భావిస్తోన్న పోలీసులు.. అతన్ని ఈ కేసులో A 2 గా చేర్చారు పోలీసులు.

రామకృష్ణ పాల్వంచలో మీ సేవా కేంద్రాన్ని నిర్వహించేవాడు.రెండు నెలల క్రితం ఈ మీ సేవా కేంద్రాన్ని అమ్మేశాడు. ఆ తర్వాత రాజమండ్రికి నివాసాన్ని మార్చాడు. ఆత్మహత్యకు రెండ్రోజుల ముందు.. భార్య పిల్లలతో కలసి పాల్వంచకు వచ్చాడు. తల్లి రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో రామకృష్ణకు అతని అక్కకూ తేడా వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో గత కొద్ది రోజులుగా ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. తమ కుటుంబం ఆత్మహత్యకు తల్లి సూర్యావతి, అక్క మాధవి, కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవ కారణమంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. వనమా రాఘవ వేధింపుల వల్లే చనిపోతున్నట్లు తెలిపాడు. ఈ సూసైడ్‌ లెటర్‌ ఆధారంగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో రాఘవను అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు.

ఆత్మహత్యకు ముందు బాధితుడు రామకృష్ణ మాట్లాడిన సెల్ఫీ వీడియోను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని కోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వనమా రాఘవ కోసం గాలిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను కూడా నియమించారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో పాప సాహితి కూడా మరణించింది. ఇప్పటికే ఈ కుటుంబంలో ముగ్గురు చనిపోగా.. ఇప్పుడు సాహితి కూడా చనిపోవడం.. విషాదాన్ని నింపింది.

మరోవైపు ఈ ఘటన రాజకీయంగా వేడి రాజుకుంది. వనమా రాఘవ అరచకాలను పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ ఫైర్‌ అయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఎమ్మెల్యే కుమారిడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అటు సీఎం వెంటనే స్పందించి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు.. మహిళా సంఘాలు వనమా ఇంటిని ముట్టడించాయి. అనేక మందిని వేధించి ప్రాణాలు తీస్తున్న వనమా రాఘవ అరెస్ట్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. అటు.. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు వనమా రాఘవ. కేవలం రాజకీయ కక్ష తీర్చుకోవడానికి తనపై కుట్ర జరుగుతోందంటున్నాడు. మొత్తానికి.. ఈ ఆత్మహత్య కేసు .. వనమా రాఘవ చుట్టు తిరుగుతుండటంతో.. అతన్ని అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. వనమ రాఘవ అరెస్ట్‌ అయితై అన్ని విషయాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story