Farmer suicide: నా చావుకు కారణం సీఎం జగన్

కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తోడమలదిన్నె గ్రామంలో సుబ్బారెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.తన చావుకు సీఎం జగనే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.రెవెన్యూ అధికారులూ బాధ్యులేనంటూ ఆ లేఖలో ప్రస్తావించాడు.వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలం తుడమలదిన్నెకు చెందిన రైతు వెంకట సుబ్బారెడ్డి తండ్రి పేరుతో 8.29 ఎకరాల చుక్కల భూమి ఉంది.అతని తండ్రి కొంతకాలం క్రితం చనిపోయాడు.అయితే రైతు సుబ్బారెడ్డికి వ్యవసాయంలో నష్టాలు రావడంతో దాదాపు పది లక్షల వరకు అప్పులపాలయ్యాడు.
అప్పులు తీర్చడానికి పొలాన్ని అమ్మకానికి పెట్టాడు. తండ్రి పేరుతో పొలం ఉండటంతో కొనేందుకు ఎవ్వరూ ముందుకురాలేదు. దీంతో ఆ పొలాన్ని తన పేరుపై మార్చాలంటూ గత కొంతకాలంగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగాడు. అధికారులు స్పందిచకపోవడంతో విసుగుచెంది పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని జేబులో ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.నేను చనిపోయాక మా భూమికి పట్టా చేసి ఇవ్వండి అది అమ్మి అప్పులు కడతారు నేను కోరేది ఇది ఒక్కటే అని సుబ్బారెడ్డి సూసైడ్ నోట్‌లో రాసినట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com