ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు యూట్యూబర్‌లు మృతి
ఉత్తరప్రదేశ్‌లో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబర్‌లు మృతి చెందారు. నలుగురు యువకులు పుట్టినరోజు వేడుకలకు వెళ్లి ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో కారు ఢీకొట్టింది.
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను లక్కీ, సల్మాన్, షారుక్, షానవాజ్‌లుగా గుర్తించారు. ఈ నలుగురు యువకులు యూట్యూబ్‌లో రౌండ్ 2 వరల్డ్ ఛానెల్ కోసం కామెడీ కంటెంట్‌ను రూపొందించడంలో చురుకుగా వ్యవహరిస్తుంటారు.
ప్రమాదం జరిగిన వెంటనే జనం గుమిగూడి యువకులను సిహెచ్‌సి గజ్రౌలా ఆసుపత్రికి తరలించేందుకు వెంటనే అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే చికిత్స ప్రాథమిక దశలోనే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడగా వారిని చికిత్స కోసం అమ్రోహా జిల్లా ఆసుపత్రికి తరలించామని, మృతులను పోస్ట్‌మార్టం కోసం పంపామని పోలీసు అధికారి తెలిపారు.
మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని, ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీనియర్ అధికారులు పరిశీలించారని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com