కూల్‌డ్రింక్ అనుకుని విషం తాగి చిన్నారి మృతి.. అంతకుముందు తండ్రి ఆత్మహత్య..!

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటి దిక్కును కోల్పోయి తీవ్రబాధలో ఉన్న కుటుంబీకులు...అక్కడే ఉన్న కూల్‌డ్రింక్ బాటిల్‌ను గమనించలేదు. దీంతో ఇద్దరు పిల్లలు సైతం అదే కూల్‌డ్రింక్‌ను తాగటంలో చికిత్సపొందుతూ బాలుడు మృత్యువాతపడటం మరింత కలిచివేసింది. కొరసవాడలో కర్రపనితో జీవనం సాగిస్తున్న వెంకటరమణ...కరోనా దెబ్బకు ఉపాధిలేక అప్పులతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు.
అప్పులు మరిన్ని పెరగటంతో తీవ్రమనస్థాపానికి గురై...కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషాదంలో ఉన్న కుటుంబీకులు అక్కడే ఉన్న శీతలపానీయం బాటిల్‌ను పట్టించుకోలేదు. వదిలేసిన బాటిల్‌లోని కూల్‌డ్రింక్‌ను ఇద్దరు పిల్లలు తాగటంతో తీవ్ర అస్వస్థతో ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు. భర్త మృతితో లేవలేని స్థితికి చేరుకున్న మహిళ... ఇద్దరు పిల్లల పట్ల నిర్లక్ష్యం చూపింది. దీంతో మరోమారు వాంతులతో మూడేళ్ల బాలుడ్ని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ మృత్యువాతపడ్డాడు. అటు భర్తను ఇటు కొడుకును కోల్పోయిన మహిళ మరింత కుంగిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com