క్రైమ్

Anantapur: అనంతపురం జిల్లాలో ప్రేమజంటల వరుస ఆత్మహత్యలు కలకలం..

Anantapur: అనంతపురం జిల్లాలో ప్రేమజంటల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.

Anantapur: అనంతపురం జిల్లాలో ప్రేమజంటల వరుస ఆత్మహత్యలు కలకలం..
X

Anantapur: అనంతపురం జిల్లాలో ప్రేమజంటల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. రెండ్రోజుల వ్యవధిలోనే బెళుగుప్ప మండలంలో ఓ జంట.. రాయదుర్గం మండలంలో మరో ప్రేమజంట సూసైడ్ చేసుకుంది. రాయదుర్గం మండలం కెంచానపల్లికి చెందిన ధనుంజయ, రాయదుర్గానికే చెందిన శ్రీకన్య ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇరుకుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. దాంతో తీవ్ర మనస్తాపానికి చెందిన ఇద్దరూ బుధవారం రాత్రి బెళుగుప్ప మండలం నరసాపురం శివారులోని చింతతోపులో పురుగుల మందు తాగారు.

ఇదే విషయాన్ని ధనుంజయ తన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. దాంతో హుటాహుటినా స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న ఇద్దరిని రాయదుర్గం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ధనుంజయ, శ్రీకన్య ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన మరవకముందే శుక్రవారం బెళుగుప్ప మండలం జీడిపల్లిలో మరో ప్రేమజంట సూసైడ్ చేసుకుంది. ఇద్దరూ మైనర్లే కావడం అందరినీ కలిచివేస్తోంది. అయితే బాలిక మృతిలో ట్విస్టు చోటుచేసుకుంది.

పదో తరగతి పాస్ కాలేదని తన తమ్ముడిని వెంట పెట్టుకుని వెళ్లిన బాలిక కాలువలో దూకింది. ఇదే సమయంలో అదే గ్రామానికి చెందిన యువకుడు కూడా బాలికతో పాటు కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడు, బాలిక.. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

యువకుని ఆచూకీ తెలియని తల్లిదండ్రులు.. జేసీబీ యజమానిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగుచూసింది. అయితే రాయదుర్గం, బెళుగుప్ప పోలీస్‌స్టేషన్లలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని పోలీసులు చెప్తున్నారు. రెండ్రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతుండగా.. వారి గ్రామాల తీవ్ర విషాదం నెలకొంది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES