Fire Accident : పిస్తాహౌజ్ లో ఫైర్ యాక్సిడెంట్.. గర్భిణీలు పరుగో పరుగు

Fire Accident : పిస్తాహౌజ్ లో ఫైర్ యాక్సిడెంట్.. గర్భిణీలు పరుగో పరుగు
X

హైదరాబాద్ వనస్థలిపురంలోని పిస్తా హౌస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కిచెన్‌లో ఉన్న గ్యాస్ లీక్ అవ్వడం వల్ల మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. గ్యాస్ పైప్ ద్వారా కింద ఉన్న సిలిండర్లకు వ్యాపిస్తుండగా గమనించిన స్థానికులు మంటలను ఆర్పేశారు.

అదే బిల్డింగ్‌లో ఉన్న లైఫ్ స్ప్రింగ్ మెటర్నిటీ హాస్పిటల్ ఉంది. అందులో వైద్యం కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల తల్లులు పొగ ధాటికి పరుగులు తీసి రోడ్లపైకి వచ్చారు. ఆసుపత్రి యాజమాన్యం వారిని మరో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కిచెన్ లో మంటలను అదుపుచేశారు.

Tags

Next Story