TG : తెలంగాణ పోలీసులపై ఏపీలో కాల్పులు

TG : తెలంగాణ పోలీసులపై ఏపీలో కాల్పులు
X

తెలంగాణ పోలీసులపై ఆంధ్రప్రదేశ్ లో కాల్పులు జరిగాయి. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం రామాపురంలో ఈ ఘటన జరిగింది. ఓ చోరీ కేసులో విచారణకు అనంతపురం వెళ్లారు తెలంగాణ పోలీసులు. దీంతో తప్పించుకునేందుకు పోలీసులపై దుండగులు దాడికి యత్నించారు. తెలంగాణ పోలీసులపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు దుండగులు. అనంతరం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని వెళ్లారు. పరారైన దొంగల కోసం స్థానిక పోలీసులతో కలిసి తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు.

Tags

Next Story