CI : అవినీతి సీఐకి ఐదేళ్ల జైలు శిక్ష

CI : అవినీతి సీఐకి ఐదేళ్ల జైలు శిక్ష
X

లంచం కేసులో నేరం రుజువు కావడంతో ఓ సీఐ కు ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ బుధవారం కరీంనగర్ జిల్లా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ తీర్పునిచ్చారు. ఈ కేసులో నిందితునికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.

ప్రాసి క్యూషన్ కథనం మేరకు.. అదిలాబాద్ జిల్లా వాంకిడి పోలీస్ స్టేషన్ లో ఉప్పుల కృష్ణపై 2018 సంవత్సరంలో కేసులో అనుకూలంగా వ్యవహరించేందుకు నిందితుని తల్లి శశికళ రూ. 10వేలు లంచం ఇవ్వాలని సీఐ చింతపట్ల లచ్చన్న డిమాండ్ చేశారు. దీంతో శశికళ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఏసీబీ అధికారుల సూచన మేరకు శశికళ లంచం డబ్బులను సీఐకి అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

ఈ కేసులో సాక్షులను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిషోర్ విచారించారు. ఇరుపక్షాలు వాదనలను విన్న న్యాయమూర్తి కుమార్ వివేక్ నిందితుడు చింతపట్ల లచ్చన్నకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.

Tags

Next Story